Yeme Pilla, Pt. 2 (DJ Version)歌词由Sri Latha Yadav&Madeen sk演唱,出自专辑《Yeme Pilla, Pt. 2 (DJ Version)》,下面是《Yeme Pilla, Pt. 2 (DJ Version)》完整版歌词!
Yeme Pilla, Pt. 2 (DJ Version)歌词完整版
పల్లవి:
ఏమే పిల్లా అంటాంటే
ఏదో ఏదో ఐతాందే వాడు
రాయే పిల్లా అంటాంటే
పానమస్సలాగనంటాంది
సీటీ గొట్టి వాడు సైగ జేసి
సిగ్గులన్ని తట్టి లేపినాడే
పట్టు వట్టి ఓరకంట చూసీ
నన్నట్ట ఉయ్యాలలూపినాడే
ఒట్టు వెట్టుకున్న ఓరీదేవా
ఎండకొండ లాంటి పోరడేరా
కట్టుకుంట గాని కట్నమియ్య
కంటిపాపాలెక్క సుసుకుంట
చరణం:01
పొట్టి పొట్టంటు పిలిసినాడే
పొట్టు పొట్టుగ నచ్చినాడే
ఇట్టా ఇట్టగా రమ్మన్నాడే
ఏమున్నవే బుట్టబొమ్మన్నడే
ముసి ముసి నవ్వుల పిల్లగాడే
మనసును మెల్లగ దువ్వినాడే
సన్నాటి నడుమన సెయ్యిలేసి
సిన్నదాన నువ్వే సాలన్నాడే
ఒట్టు వెట్టుకున్న ఓరీదేవా
ఎండకొండ లాంటి పోరడేరా
కట్టుకుంట గాని కట్నమియ్య
కంటిపాపాలెక్క సుసుకుంట
చరణం:02
సోకుల సూపులు నాటినాడే
నా గుండె తలుపులు దాటినాడే
నేనంటే పడిసచ్చే పోటుగాడే
పానమియ్యనీకి యెనకాడడే
నవ్వుతాడే వాడు నెలవంకలా
తొడుంటడే గువ్వగోరింకలా
వానికి లేదమ్మా ఏ వంకరా
పెట్టబోనన్నాడే ఏ అల్లరా
ఒట్టు వెట్టుకున్న ఓరీదేవా
ఎండి కొండ లాంటి పోరడేరా
కట్టుకుంట గాని కట్నమియ్య
కంటిపాప లెక్క సుసుకుంట
చరణం:03
పూత వెట్టినట్టు చైత్రమాసం
కూతవెట్టే వయసు వానికోసం
వాడి ప్రేమే నాకు నిండు గాసం
లేకుంటే బతుకంత పాడుమోసం
ఇంకేది లేదయ్య అక్కెర వాడు
దక్కితే చాలయ్య శంకరా
ఒక్కపొద్దులుంట ఈశ్వరా
జర్ర ఒక్కటయ్యటట్టు సూడరా
ఒట్టు వెట్టుకున్న ఓరీదేవా
ఎండి కొండ లాంటి పోరడేరా
కట్టుకుంట గాని కట్నమియ్య
కంటిపాప లెక్క సుసుకుంట