Dear Tara歌词由NC Karunya演唱,出自专辑《Dear Tara》,下面是《Dear Tara》完整版歌词!
Dear Tara歌词完整版
ఈ పరుగు నిన్ను చేరేందుకా..
మిగిలిపోమాకు ప్రశ్నగా..
ఒంటరైన ప్రతి జీవితానికొక అర్ధమే కోరగా..
నీ గమ్యమెదనే తెలియక..
గమనం ఎందుకు దండగ..
నన్ను నేనే కోల్పోయానిలా
మనసేమో చెబితే వినాలా..
మరలా నిన్ను వెతికే పనిలా..
నన్ను నేనే కలిశా మాయలా..
ఒక్కటే జీవితం
పంజరం వదిలి బయటకు రారా..
అడుగడుగునా ఆనందమే చూడరా..
లోకమే కాగితం
రాత రాసేది నువ్వే కదరా..
ప్రతి రోజు చరితలా రాయరా..
నీ గతమే నిన్ను తరుముతూ ఉన్నా
నేడు కూడా అవుతుందిగా నిన్న
నీది కాదు గడిచిన క్షణమైనా
నిజమే తెలిసినా..
తెలియకనే పొరపాటులు గాని..
మోయలేదు మది ఈ భారాన్నీ
ఎంత దూరాన ఉన్నా కానీ
నిన్నే చేరని
కలలో ఆనందం కన్నుల ముందర లేకుంటే..
కదిలే కాలాన్నే బదులే అడగాలి...
గెలుపే సాధించే గమనం గమ్యం
నీకుంటే
నిన్నలు మరిచి నువ్వు ముందుకు సాగాలి
ఒక్కటే జీవితం
పంజరం వదిలి బయటకు రారా..
అడుగడుగునా ఆనందమే చూడరా..
లోకమే కాగితం
రాత రాసేది నివ్వే కదరా..
ప్రతి రోజు ఒక చరితలా రాయరా..
యె దారి లేని నా ప్రయాణమే..
నిన్ను చేరలేననే మతనమే..
తుది శ్వాస వరకు నే వెతుకుతాను ప్రతి నవ్వు లోన నిన్నే..