Vale Vale Enniyalo歌词由Vijay Ileni&Santosh Ileni演唱,出自专辑《Vale Vale Enniyalo》,下面是《Vale Vale Enniyalo》完整版歌词!
Vale Vale Enniyalo歌词完整版
వాలే.. వాలే..
వాలే.... వాలే.....!!
పొద్దుగూకే ఏళలో
నీ కాటుక కనులే..!
మలిపొద్దు మాయం జేసే
నెలవంకోలే..!
నా మనసుని దోచినయే పిల్లా..
నా గుండెని కోసినయే పిల్లా..
నా నిదురని కాసినయే పిల్లా..
నీ బందీని చేసినయే పిల్లా..!!
పల్లవి :
వాలే.. వాలే ఎన్నియలో..
అరె.. వలపులు జల్లే ఎన్నియలో..
వాలే.. వాలే ఎన్నియలో..
ఆశ వరదై పొంగే ఎన్నియలో.. -2
చరణాలు :
ఈ ఎన్నెల సుట్టు సుక్కల్లే తిరిగా..
తొలిపొద్దు ఎరుపే తన కొంగున మెరిసే..
మువ్వ సడిలో.. పెదవి విరుపుల్లో..
ముద్దయి తడిసా.. తొలిపొద్దై నిలిచా..!
అలసిన సొగసే, కసిరే వయసే..
కొసరుతు అడిగే వరసే..!
పన్నీటి సంద్రాన్ని.. కౌగిట్లో బంధాన్ని..
ముద్దుగ నాతో అల్లే..
పిలుపే తనది.. వలపే నాది..!
జారే.. జారే ఎన్నియలో..
తన పైటే జారే ఎన్నియలో..
జారే.. జారే ఎన్నియలో
నా మనసే జారే ఎన్నియలో.. -2
సీకటి ఏలలో నీకై వేచా..
ఆ నింగి వైపు తొంగి చూసి
కళ్లు తేలేసా...
నన్ను నిదుర పుచ్చేందుకు..
సల్ల గాలి ఉరికి వచ్చే..
నీ రాకకై వేచే నా కన్నులు
నిదురతో యుద్ధమే చేసే..
నీ తలపులతో నా మది తలపులు
తెరిచి వేచి చూస్తున్నదే..
ఒచ్చే జన్మ లో కూడా నువ్వే
నా ప్రేమని నాతో చెప్పినదే..
నెమలి సింగారలే
శృంగారానికి సయ్యడే..!
రానుపోను ఎన్నియలో..
నీ రస్తా నేనే ఎన్నియలో..
వస్తా.. వస్తా.. ఎన్నియలో..
నీ పొగరుని కాస్తా ఎన్నియలో..
పారే.. పారే.. ఎన్నియలో..
చెలి సొగసే పారే ఎన్నియలో..
వారే.. వారే.. ఎన్నియలో..
తాప సంద్రం పొంగే ఎన్నియలో..
వాలే వాలే ఎన్నియలో..
అరె.. వలపులు జల్లే ఎన్నియలో..
వాలే.. వాలే ఎన్నియలో..
ఆశ వరదై పొంగే ఎన్నియలో.. 2
జారే.. జారే ఎన్నియలో..
తన పైటే జారే ఎన్నియలో..
జారే.. జారే ఎన్నియలో
నా మనసే జారే ఎన్నియలో.